15-11-2025 09:55:57 AM
హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్(Gandhinagar Police Station) పరిధిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా నగర్ లోని ఇంట్లో ఉరి వేసుకుని టీసీఎస్ ఉద్యోగి(TCS Software Employee) అయిన విశాల్ గౌడ్ ప్రాణాలు తీసుకున్నాడు. భార్య కేసు పెట్టిందనే మనస్తాపంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయని పోలీసులు తెలిపారు. గతంలో భార్య ఫిర్యాదుతో విశాల్ గౌడ్ పై ఉప్పల్ పోలీసులు(Uppal Police) కేసు నమోదు చేశారు. కుటుంబీకుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.