15 May, 2026 | 8:36 PM

Breaking News

యువతి యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!   •   అక్రమ ఇసుక లారీ పట్టివేత   •   వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు   •   డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు   •   తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం   •   బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి   •   సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •  

చిరుత దాడిలో పాడి దూడ మృతి

05-02-2025 12:34 AM

బెంబేలెత్తుతున్న గ్రామస్థులు

కామారెడ్డి, ఫిబ్రవరి 4(విజయ క్రాంతి): పాడి దూడపై చిరుత దాడి చేసి లేగ దూడను చంపిన ఘటన మంగళ వారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బోనాల్ గ్రామం లో చోటు చేసుకుంది. బంజారా తాండాకు చెందిన బార్మవత్ దరియాకు చెందిన పాడి దూడపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బార్మవత్ దరియాకు అటవీని అనుకుని ఉన్న తన  పంట చేను వద్ద రోజు వారీగా పశువులను అక్కడే కట్టేసేవాడు.రోజు లాగానె సోమవారం  సాయంత్రం పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి చూడగా లేగదూడ చనిపోయి ఉంది.

దీంతో బాధితుడు గ్రామస్తులకు,స్థానికులకు, సమాచారం  ఇవ్వడంతో సంఘటనస్థలానికి చెరుకుని చిరుత దూడను చంపి తిన్నదని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.మృతి చెందిన పాడి దూడ 35 వేల రూపాయల విలువగలదని  ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.చిరుత సంచారంతో బోనాల్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాలంటేనే గ్రామస్తులు,రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు జంకుతున్నారు.