15 May, 2026 | 9:15 PM

బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం

15-05-2026 08:16 PM

రూ.50 లక్షల SDF నిధులతో నిర్మాణం

ఎమ్మెల్యేలు పోచారం,తోట, ఆగ్రో చైర్మన్ కాసుల హాజరు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో SDF నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంతారావు మాట్లాడారు. ప్రజల సమస్యలను అధికారులు తక్షణమే గుర్తించి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను విని చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.

సేవా కేంద్రాలుగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సేవా కేంద్రాలుగా పనిచేయాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పనులు పూర్తి చేసుకునేలా అధికారులు సహకరించాలని వారు పేర్కొన్నారు.నూతన ఆర్డీఓ రవీందర్ రెడ్డికి ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ-జుక్కల్ పరిధిలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన 8 మండలాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ విట్టల్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.