15 May, 2026 | 9:15 PM

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి

15-05-2026 08:18 PM

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రస్తుతం ఎండాకాలం పాఠశాలలు, పరీక్షలు ముగించుకుని ఇంటికి వచ్చిన విద్యార్థులు, ఇంటి వద్ద ఉంటున్న విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె ఖానాపూర్ మండలంలోని చందు నాయక్ తండాలో గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని గ్రామపంచాయతీలో  కథల పుస్తకాలు, కామిక్స్ వంటి పుస్తకాలను అందించి, విద్యార్థులకు హితవు పలికారు. సెలవుల కారణంగా నిర్లక్ష్యంగా వాగులు, చెరువులకు వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలు ,ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆటలు సరికావని ,వీరిని పెద్దలు గమనిస్తూ ఉండాలని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలో నర్సరీ సెగ్రికేషన్ షెడ్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ ఓ సి హెచ్ రత్నాకర్ రావు, గ్రామ సర్పంచ్, పలువురు ఉన్నారు.