calender_icon.png 19 October, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బందుకు దళిత సేన సంపూర్ణ మద్దతు

18-10-2025 06:11:23 PM

మందమర్రి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు దళిత సేన ఎమ్మార్పీఎస్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. శనివారం పట్టణంలో నిర్వహించిన బందులో దళిత సేన నాయకులు, దళితరత్న తుంగపిండి రాజేష్ కుమార్ పాల్గొని బంద్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 42 % రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేసిందని, దీనిని జీర్ణించుకోలేని బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కావాలనే రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే బిసి రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిసి, ఎమ్మర్పిఎస్ నాయకులు  పాల్గొన్నారు.