16 June, 2026 | 1:53 AM

ఘనంగా ముగిసిన డాన్స్ పోటీలు

16-06-2026 12:00 AM

విజేతలకు బహుమతులు అందజేసిన దండు సారయ్య

ఇల్లందు టౌన్, జూన్ 1౫ (విజయక్రాంతి) : ఇల్లందు 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య పుట్టినరోజు సందర్భంగా వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో, వీబీసీసీ సహకారంతో సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల స్థాయి డాన్స్ పో టీలు ఘనంగా ముగిశాయి.  దండు సారయ్యతో భారీ కేక్ కట్ చేయించి, గజమా లతో సత్కరించారు. విజేతలకు సారయ్య  నగదు బహుమతులు, షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు.

సీనియర్స్ గ్రూప్ విభాగంలో నాచురల్ నవీన్ టీమ్ (వరంగల్), ఎంజే అశోక్ టీమ్ (మణుగూరు) ప్రథమ బహుమతి, కళ్యాణ్ టీమ్ (భూపాలపల్లి) ద్వితీయ, గణేష్ టీమ్ (భూపాలపల్లి) తృతీయ బహుమతులు, జూనియర్స్ గ్రూప్ విభాగంలో వనపర్తి టీమ్ ప్రథమ, ఎంజే అశోక్ టీమ్ (మణుగూరు) ద్వితీయ, ప్రసంగి టీమ్ (జమ్మికుంట), బిట్ బిట్ ప్రశాంత్ టీమ్ (గోదా వరిఖని) తృతీయ బహుమతులు, సీనియర్ సోలో విభాగంలో అభి (విశాఖపట్నం) ప్రథమ, పరమేష్ కుమార్ (హైదరా బాద్) ద్వితీయ, లాస్య (జమ్మికుంట) తృతీయ బహుమతి సాధించారు.  సారయ్య మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహిం చడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

కార్యక్రమంలో డాక్టర్ ఆకుల లక్ష్మి, పబ్బోలు స్వాతి కిరణ్, పింగళి అనన్య నరేష్, ఓంగూరి శ్రీనివాస్, దాసరి గోపాలకృష్ణ, రవి నా యక్, కడారి నటరాజ్, సర్వేశ్ మాస్టర్, రమేష్ మాస్టర్, ప్రభురాజు మాస్టర్, నవ్య మౌనిక మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించా రు. వెంకట్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కడారి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయి మా స్టర్, శ్రీకాంత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రాజేష్ మాస్టర్, సాయి కిరణ్ మాస్టర్  పాల్గొన్నారు.