లయన్స్ క్లబ్ ఆఫ్ విశ్వాస్ ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం
16-06-2026 12:00 AM
సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 15(విజయక్రాంతి): ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా సోమవారం సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలో లయన్స్ క్లబ్ ఆఫ్ విశ్వాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ రెవరెండ్ కేవీకే రావు, ప్రొ.ఛాన్స్‌లర్ భారతీదేవి, సీఈవో శ్రీహర్ష శశాంక్, సీవోవో కే.ఇందు అపర్ణ, వైస్ ఛాన్స్‌లర్ లెఫ్టనెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్‌నాయర్, డీన్ అండ్ ఫ్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ వేజెండ్ల, డాక్టర్ శ్వేత హెచ్‌వోడీ, విశ్వాస్ క్లబ్ సెక్రటరీ లయన డాక్టర్ ఇ.సతీష్‌రెడ్డి, క్యాంప్ చైర్‌పర్సన్ లయ న్ జి.సారంగపాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






