23 June, 2026 | 7:43 PM

Breaking News

నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •  

చుండ్రు నివారణకు!

15-10-2024 12:00 AM

కాకరకాయలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగల్‌ను తొలగించుకోవచ్చు. కాకరకాయ రసం తలలో తేమను తగ్గించి, చుండ్రు పెరగకుండా చేస్తుంది. ఇవి మాడుకు పోషణను ఇచ్చి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయతో జట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.. 

* ముదురు ఆకుపచ్చగా ఉన్న కాకరకాయను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొసి, విత్తులను తీసేయాలి. కాకరకాయ ముక్కలను బ్లెండర్ జార్‌లో వేసి, పాలు కలిపి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు పూర్తిగా అప్లు చేసి మృదువుగా మసాజ్ చేసి, 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల ను శుభ్రంగా చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కురులు ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య దూరం అవుతుంది. 

* కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఆ తర్వాత ఆ ముక్కలను పిండి తీసేయాలి. ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది. 

* కాకరకాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే తలపై ఉన్న మాడును ఇది హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. 

* కాకరకాయలో ఉండే విటమిన్లు వెంట్రుకలను అందంగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కారకాయ జ్యూస్ జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పని చేస్తుంది.