11 August, 2026 | 1:44 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

డీఏఓ పై విచారణ జరిపించాలి

21-06-2025 06:11 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): నకిలీ ఎస్సీ సర్టిఫికెట్ తో జిల్లా వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రావూరి శ్రీనివాస్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు దుర్గం దినకర్, గోడిసెల కార్తీక్ శనివారం హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్, డైరెక్టర్ విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అధికారి ఎస్సీని అని ఉన్నతాధికారులను నమ్మించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఎస్సీగా చలామణి అవుతున్న ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.