calender_icon.png 21 June, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు

21-06-2025 06:13:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి అంకితభావంతో పని చేయడం వలన పోలీస్ శాఖకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లాలో వివిధ నేరాల కింద పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను సత్వరం పరిష్కరించేందుకు లోక అదాలత్ ద్వారా కృషి చేసిన 30 మంది పోలీస్ సిబ్బందికి శనివారం సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందించారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు లేకుండా చూడాలని ప్రజలకు ఏ న్యాయం కావాలన్నా పోలీస్ శాఖ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి అవినాష్ కుమార్ రాకేష్ మీనా సిఐలు గోవర్ధన్ కృష్ణ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.