1 August, 2026 | 1:35 AM

ఊర్సు.. మత సామరస్యానికి ప్రతీక

01-08-2026 12:39 AM

బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్

సికింద్రాబాద్, జూలై 31 (విజయక్రాంతి): దర్గా ఊర్షు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బో యినపల్లి కడక్ పురా లోని హాజ్రాత్ మిస్కెన్ షా ఖాద్రి ఆర్ హెచ్ దర్గా ఊర్షు ఉత్సవం ద ర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ కులమత బేదాభిప్రాయాలూ లేకుండా హిందూ ముస్లీంలు ఊర్సులో పాల్గొంటారని అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్ధించినట్లు జంపన తెలిపారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ప్రతినిధులు జంపన ప్రతాప్, మరో బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, సబ్రీ, మొహమ్మద్ సులేమాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.