1 August, 2026 | 1:35 AM

విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

01-08-2026 12:37 AM

-ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 31 (విజయక్రాంతి): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. శ్రీ సాయి సరస్వతి విద్యానికేతన్ ఆధ్వర్యంలో విద్యార్థుల పదవీ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడి యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.పాఠశాల ఎన్నికల్లో ఎన్నికైన విద్యార్థి నాయకులకు పదవీ స్వీకార బ్యాడ్జీలతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చదు వుతో పాటు క్రమశిక్షణ కూడా అలవడాలన్నారు. అంతేకాకుండా బాధ్యగల పౌరు లు గా ప్రతి విద్యార్థి ఎదిగిన రోజే చదువుకు సా ర్థకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ చిన్న శ్రీ శైలం యాదవ్, స్కూల్ ఎండీ భవాని శంకర్, చైర్మన్ శిరిష, మధురానగర్ సీఐ ప్రభాకర్, హైకోర్టు అడ్వకేట్ తులసి రాజ్‌గోకుల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.