04-12-2025 02:54:48 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఇందారపు మధుకర్ శర్మ,అర్చకుడు ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సాయి బాబా,దత్తాత్రేయ,గణపతి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అనంతరం గీతా పారాయణం,సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు.సాయిబాబా పల్లకి సేవ నిర్వహించి బాబాకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.మండలంలోని నలుమూల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించారు.