calender_icon.png 4 December, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి పేరుతో మోసం

04-12-2025 02:05:40 PM

హైదరాబాద్: ఆన్లైన్లో పెళ్లి పేరుతో ఓ హైదరాబాద్ మహిళ మోసపోయింది. యూకే డాక్టర్(UK Doctor)గా నటిస్తూ హిరాద్ అహ్మద్ వాట్సాప్ కాల్స్ ద్వారా మహిళకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే మహిళకు యూకే వీసా ఇప్పిస్తానని నిందితుడు నమ్మబలికాడు. వీసా కోసం సైబర్ నేరగాడు పలు విడుతలుగా రూ. 3.38 లక్షలు వసూలు చేశాడు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.