calender_icon.png 4 December, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

04-12-2025 02:59:24 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు 

పటాన్ చెరు:  ప్రస్తుత పోటీ ప్రపంచంలో  విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక వికాసం, శారీరక ధారుడ్యం  లభిస్తుందని తెలిపారు.

ర్యాంకుల మాయలో పడి క్రీడలను నిర్లక్ష్యం చేయవద్దని పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడంతో పాటు.. ఆధునిక వసతులతో స్టేడియాలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, TRSMA రాష్ట్ర కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు సాయి తేజ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఎస్సై మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.