calender_icon.png 4 December, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి

04-12-2025 02:57:21 PM

  1. కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు పోరాటం
  2. లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్నికి గుణపాఠం తప్పదు
  3. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయండి
  4. డిసెంబర్ 7న మెదక్ లో కార్మిక ప్రదర్శన -  బహిరంగ సభ
  5. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్
  6. పాశమైలారం పారిశ్రామిక వాడలో  సిఐటియు 2కే రన్

పటాన్ చెరు: కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని, లేనిపక్షంలో కేంద్ర బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ అన్నారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ పట్టణంలో డిసెంబర్ 7 నుండి 9 వరకు జరగతున్న సందర్భంగా పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.. కిర్బీ చౌరస్తా నుండి బిపిఎల్  వరకు రన్  నిర్వహించారు. ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ... కేంద్ర  బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ తో కార్మికులు బానిసలుగా మారుతారని అన్నారు. కార్మికుల హక్కులపై మోడీ ప్రభుత్వం కత్తి పెట్టి సవారిచేస్తుందని అన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ ను కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించాలని అన్నారు.. సిఐటియు రాష్ట్ర మహాసభల్లో 33 జిల్లాల నుండి కార్మిక పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ప్రతినిధులు పాల్గొంటున్నారని అన్నారు. డిసెంబర్ 7న జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, అఖిలభారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్సేన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభలను కార్మికులు ఉద్యోగులు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, నాయకులు రాజు తలారి శ్రీనివాస్ వెంకటేష్ శేఖర్ రెడ్డి నాగరాజు నవీన్ ప్రవీణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.