04-12-2025 02:53:36 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల అభ్యర్థులు, బిటిఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ అభ్యర్థిని, వార్డు సభ్యులను గెలిపించుకునేందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.