కేర్ హాస్పిటల్స్‌లో అరుదైన శస్త్రచికిత్స
మహిళ కడుపులో 35 సెంటీమీటర్ల భారీ ఓవరియన్ ట్యూమర్ తొలగింపు
హైదరాబాద్, 25 మార్చి (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా 35 సెంటీమీటర్ల ఓవరియన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించి వేముల వాడకు చెందిన 59 ఏళ్ల నల్లా లకి కొత్త జీవితం ప్రసాదించారు.ఈ ట్యూమర్ గత కొన్ని నెలలుగా మెల్లగా పెరుగుతూ పొత్తికడుపు భాగంలో పెద్ద భాగాన్ని ఆక్రమిం ంది. రోగికి మొదట స్వల్పంగా పొత్తికడుపు వాపు, అసౌకర్యం ఉండగా, క్రమంగా అది పెరిగి రోజువారీ జీవితంపై ప్రభావం చూపింది.
దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా, విపులమైన పరీక్షలు, అత్యాధునిక స్కానింగ్ ద్వారా పెద్ద పరిమాణంలో మల్టీలోక్యులేటెడ్ ఓవరియన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తిం చారు. ఈ కేసును సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ వై. యుగంధర్ రెడ్డి నేతృత్వంలో బహుళ నిపుణుల బృందం నిర్వహించింది. రోగికి స్టేజింగ్ లాపరోటమీ నిర్వహించి, కుడి వైపు ఉన్న ట్యూమర్ తొలగింపు, ఎడమ ఓవరీ తొలగింపు (లెఫ్ట్ ఊఫోరెక్టమీ), అలాగే ఇన్ఫ్రాకోలిక్ ఓమెంటెక్టమీ వంటి సమగ్ర క్యాన్సర్ చికిత్స విధానాలు అమలు చేశారు.
జనరల్ అనస్థీషియాలో జరిగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తుంది. ఆపరేషన్ సమయంలో చేసిన పరిశీలనలో, కుడి ఓవరీ నుంచి ఏర్పడిన పెద్ద సిస్టిక్ ట్యూమర్‌గా నిర్ధారించగా, కాలేయం, ప్లీహం, పేగులు వంటి ముఖ్య అవయవాలకు వ్యాప్తి చెందలేదని గుర్తించడం సానుకూల సూచికగా వైద్యులు తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం రోగిని సర్జికల్ ఐసీయూలో పర్యవేక్షిస్తూ యాంటీబయాటిక్స్ అవసరమైన చికిత్స అందించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా కోలుకుని, వైద్యుల సూచనలతో డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ వై. యుగందర్ రెడ్డి మాట్లాడుతూ, ఓవరియన్ ట్యూమర్లు ఎక్కువగా లక్షణాలు లేకుండా పెరుగుతాయి. చాలా సందర్భాల్లో ఆలస్యంగా గుర్తించబడతాయి. పొత్తికడుపు వాపు లేదా అసౌకర్యం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. త్వరగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు.
కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ గుప్తా మాట్లాడుతూ, నిపుణుల వైద్య బృందం, కట్టుదిట్టమైన క్లినికల్ విధానాలతో క్లిష్టమైన క్యాన్సర్ కేసులను విజయవంతంగా నిర్వహించడం మా వైద్య సామర్థ్యానికి నిదర్శనం. రోగి కేంద్రంగా ఉన్న సేవలతో మెరుగైన ఫలితాలు సాధించడమే మా లక్ష్యమన్నారు. అధునాతన ఆంకాలజీ చికిత్సలో కేర్ హాస్పిటల్స్ తమ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, నిపుణుల వైద్యం, ఆధునిక శస్త్రచికిత్స సాంకేతికతలు, రోగి కేంద్ర దృక్పథంతో సేవలను అందిస్తోంది.




