6 June, 2026 | 1:41 AM

పెద్దితో అవమానం.. నిజమేనా?!

06-06-2026 12:03 AM

బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఒక ఇన్‌స్టా పోస్టును లైక్ కొట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి కూతురుగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే జాన్వీ అనూహ్య స్పందన ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసినట్టయ్యింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలో జోరు చూపించింది.

మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.135 కోట్లు వసూలు చేసింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీకపూర్ ‘అచ్చియమ్మ’ అనే పూర్తి గ్లామర్ పాత్రలో కనిపించింది. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నాయి. జాన్వీ పాత్ర కథకు సంబంధం లేకుండా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో జాన్వీ ఓ ఇన్‌స్టా పేజీ రివ్యూను లైక్ చేయ డం ఇప్పుడు అన్ని మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే.. ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఇన్‌స్టాలో ఓ పేజ్ పెట్టిన రివ్యూను జాన్వీ కపూర్ లైక్ చేసింది. ఎందుకంటే, సదరు పేజ్ నిర్వాహకులు ఆ రివ్యూలో జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేద ని పేర్కొన్నారు. ‘పెద్ది: భార తీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్ పెట్టారు. దీన్ని జాన్వీ లైక్ చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

నిజంగానే ఈ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించిందని కొందరు అంటుంటే.. జాన్వీ పాప పొరపాటున లైక్ కొట్టి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమై నా జాన్వీ లైక్‌పై నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తుండటం, ఇందుకు సంబం ధించిన వార్తలు వెల్లువలా రావడంతో జాన్వీ ఆ పోస్టును అన్‌లైక్ చేసింది.

కానీ, ఆలో పే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యా యి. మరి జాన్వీ నిజంగానే ‘పెద్ది’లో తన పాత్రకు దక్కిన ప్రాధాన్యం పట్ల అసంతృప్తితో ఉందా! కారణం ఏమై ఉంటుంది? ఈ విషయంపై టీమ్ స్పందిస్తుందా?! జాన్వీ పాప అయినా నోరు విప్పుతుందా!! చూడాలి.