30 May, 2026 | 2:31 AM

ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వండి

30-05-2026 01:26 AM

‘సర్’ విధులు నిర్వహించే ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓల తరఫున సీఈవోను కోరిన డీసీఏ అధ్యక్షుడు లచ్చిరెడ్డి

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్)లో వి ధులు నిర్వహిస్తున్న ఓటరు నమోదు అధికారులు(ఈఆర్‌ఓ), సహాయ ఓటరు నమోదు అధికారు(ఏఈఆర్‌ఓ)లకు ఒక నెల వేతనం ఇవ్వాలని తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌ను డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి కోరారు.

సీఈవో సుదర్శన్‌రెడ్డిని శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నేత లు కలిసి భారత ఎన్నికల సంఘం సవరించిన దాని ప్రకారం బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు  పారితోషికం, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు  గౌర వ వేతనాల అమలుపై చర్చించారు.

ఇదే కా కుండా సర్‌లో విధులు నిర్వహించే ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చినట్టుగానే ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరారు. 2025 సంవత్సరానికి సంబంధించి బీఎల్‌ఓలు,  సూపర్వైజర్లకు చెల్లించవలసిన పారితోషికం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అందలేదన్నారు. భారత ఎన్నికల సంఘం సవరిం చిన దాని ప్రకారం పారితోషికం బీఎల్‌ఓలలకు రూ.12వేలు, బీఎల్‌ఓ సూపర్వైజర్లకు రూ.18వేలు, ఏఈఆర్‌ఓలకు రూ. 25వేలు, ఈఆర్‌ఓలకు రూ.30వేల చొప్పున చెల్లించాలని కోరారు.

భారత ఎన్నికల సం ఘం సవ రించిన  రేట్ల ప్రకారం పారితోషి కం, గౌరవ వేతనాల చెల్లింపునకు అవసరమైన బడ్జెట్ కేటాయించవలసిందిగా కోరారు. సీఈవో సానుకూలంగా స్పందించారని లచ్చిరెడ్డి చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే అన్ని అంశాలపై సానుకూల నిర్ణయం వ స్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో త హసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, మహిళా అధ్యక్షురాలు రాధా, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, రాణాప్రతాప్, హేమమాలిని, గోవర్ధన్, పాల్గొన్నారు.