calender_icon.png 19 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులర్పించిన డిసిసి జిల్లా అధ్యక్షులు

19-11-2025 03:55:05 PM

డిసిసి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్

శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట్ మండలం చిన్న గొట్టిముక్కుల చౌరస్తా వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ  ఇందిరా గాంధీ  జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, శివంపేట్ మండల నాయకులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఉక్కు మహిళా ఇందిరమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.