19-11-2025 03:50:38 PM
పోలీసుల స్పెషల్ డ్రైవ్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తమ ప్రచారాల కోసం ఇతర సమాన్యులు, వాహనాలు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సీరియస్ అయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తూ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల చెందిన ఓ విద్యార్థిని ప్రమాదానికి గురి కావడంతో అందుకు ట్రాఫిక్ సమస్య కారణంగా గుర్తించి అందుకు తగిన చర్యలను చేపట్టారు.
స్థానిక మున్సిపల్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా అడ్డగోలుగా ఆయా రాజకీయ నేతలు, వ్యాపారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు ప్రత్యేక వాహన ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను బ్యానర్లను తొలగించారు. మైనర్ లకు వాహనాలు ఇచ్చి రోడ్లమీదకి పంపొద్దని ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.