calender_icon.png 26 November, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొంగులేటి, ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న

26-11-2025 04:45:54 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన తోట దేవి ప్రసన్న బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్దిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఆర్ఆర్ఆర్ ఆమెను అభినందించారు. భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తు కార్యక్రమాలపై ముఖ్యమైన సలహాలు, సూచనలు చేశారు. పార్టీ బలోపేతం, కేడర్‌కు ఉత్సాహం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సాగాల్సిన పార్టీ చైతన్య కార్యక్రమాలపై పలు సలహాలు ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ఉన్నారు.