calender_icon.png 26 November, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు ప్రతి విద్యార్థి వరకు చేరాలి

26-11-2025 04:38:28 PM

కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శిస్తున్న ఈ ఎక్స్పర్మెంట్స్ అన్ని ప్రతి విద్యార్థి వరకు చేరిన నాడు ఈ ప్రదర్శన సఫలీకృతం ఐనట్టు, అందుకు ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లాలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసుకున్నందుకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖాధికారికి, ఇతర బాధ్యులకు అభినందనలు. ఈ నెల 25, 26, 27 తేదీలలో జరుగుతున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడుతూ సైన్స్  ఫెయిర్ లు విద్యార్థులలో వైజ్ఞానిక పరిజ్ఞానం, తాత్విక ఆలోచనలు, సృజనాత్మక పెంపొందించుతా యని అన్నారు. 

నేటి ఈ సైన్స్ ఫెయిర్ లే రేపటి మానవ జీవనానికి అధునాతన సౌకర్యాలకు మార్గాలు అని పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఉపయోగిస్తున్న టెక్నాలజీ విద్యార్థుల ప్రయోగాలద్వారా అభివృద్ధి సాధించినది అని తెలిపారు. సాంబశివ రావు  సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం MEO మధురవాణి, ప్రభత్వ  పరీక్షల విభాగం జిల్లా కార్యదర్శి మాధవరావు, జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్లు సతీష్, సైదులు, నాగరాజశేఖర్, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నీరజ, చుంచుపల్లి, జూలూర్పాడ్, లక్ష్మీదేవిపల్లి, చండ్రుగొండ మండల విద్యా శాఖాధికార్యులు బాలాజీ, ఝుంకీలాల్, కృష్ణయ్య, సత్యనారాయణ వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు సంజీవ రావు, ద్రౌపది, వాణి, లక్ష్మి, వివిధ పాఠశాలల విద్యార్థులు, మీడియా ఇంచార్జ్ రాములు, దస్తగిరి, జహంగీర్ షరీఫ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రయోగాలు అద్భుతం 

డాక్టర్ తెల్లం వెంకట రావు, భద్రాచలం శాసన సభ్యులు.

53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో ప్రదర్శిస్తున్న ప్రయోగాలను పరిశీలించిన డాక్టర్ తెల్లం వెంకట రావు MLA భద్రాచలం శాసన సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచి ప్రయోగాలు చేసి ప్రదర్శించు తున్నారన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న  ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయన్నారు. నిర్వాహకులను అభినందించారు.