26-11-2025 04:32:22 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారుడికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ బుధవారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం ఆర్థిక సహాయనిధి కింద అందుతున్న ఈ సహాయం రోగుల కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, నాయకుడు నిసార్ తదితరులు పాల్గొన్నారు.