26-11-2025 04:43:19 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు అధికారులు, సిబ్బంది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలను నిలబెడతామని, రాజ్యాంగానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తామని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, పౌరుల హక్కులు, విధులు, పోలీస్ వ్యవస్థలో దాని పాత్ర గురించి డిఎస్పీ సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఇతర ఏఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.