26-11-2025 04:27:48 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భారత ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, కొత్తగూడెం ఏరియా జిఎం కార్యలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు మాట్లాడుతూ 2015 నుంచి ఏట నవంబర్ 26వ తేదీన ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26, 1950 రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది నవంబర్ 26, 1949 అని తెలిపారు. ఈ యొక్క రాజ్యాంగ ఫలాలను భారత పౌరులమయిన మన అందరమూ స్వేచ్చగా పొందుతూన్నామని, ప్రతి ఒక్కరు ఉత్తమ పౌరులుగా జీవించాలని అన్నారు.
ఈ సంధర్భముగా డిజిఎం(పర్సనల్) జి.వి. మోహన్ రావు, రాజ్యాంగం యొక్క ప్రవేశిక స్వరూపాన్ని చదివి వినిపించారు. అదేవిధముగా కొత్తగూడెం ఏరియా లోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో,ఆయా గనుల మేనేజర్లు ఉద్యోగులతో కలిసి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో జిఎంతో పాటు, ఎస్‌ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, కొత్తగూడెం ఏరియా ఎఐటియూసి బ్రాంచ్ సెక్రెటరీ వి. మల్లికార్జున రావు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఏరియా రక్షణ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఎస్.ఓ.ఎం ఎన్విరాన్మెంట్ టి. సత్యనారాయణ, అన్ని శాఖల అధిపతులు, అధికారులు, జిఎం కార్యాలయ సిబ్బంధి పాల్గొన్నారు.