30 June, 2026 | 12:40 AM

బావిలో ప్రత్యక్షమైన మహిళ మృతదేహం

13-06-2024 02:00 AM

హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసుల విచారణ

యాదాద్రి భువనగిరి, జూన్12 (విజయక్రాంతి) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు చెరువుకట్ట వద్ద గల బావిలో ఓ మహిళ మృతదేహం ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. సదరు మహిళ ఆత్మ హత్యకు పాల్పడిందా? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? అనే విషయంపై పలు సందేహాలు వ్యక్తమైతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కాకినాడ బస్తీకి చెందిన కవిత (38) బుధవారం మోత్కూరులోని తన సోదరి ఇంటికి వెళ్లింది.

అయితే, అక్కడకు ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న భువనగిరికి చెందిన నర్సింహ వచ్చినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి మోత్కూరులోని ముత్యాలమ్మ బావి వద్దకు వెళ్లారని, అక్కడ ఆమె బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఆమె వెంట వచ్చిన నర్సింహనే బావిలో తోసివేసాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదే హాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.