పిడుగుపాటుకు 41 గొర్రెలు మృతి
13-06-2024 01:59 AM
రామాయంపేటలో ఘటన
మెదక్, జూన్ 12 (విజయక్రాంతి) : పిడుగుపాటుకు 41 గొర్రెలు మృత్యువాతపడ్డ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రామాయంపేటకు చెందిన కనకరాజు, మహేశ్, మల్లయ్య అనే వ్యక్తులకు చెందిన గొర్రెలు స్థానిక వెంకన్నగారి చెరువులో నీరు తాగడానికి వెళ్లాయి. అయితే, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం రావడంతో గొర్రెలపై పిడుగు పడింది. దీంతో 41 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి, స్థానిక కౌన్సిలర్ యాదగిరి పంచనామా నిర్వహించి బాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు.






