ఐదుగురు డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో/ చార్మినార్, జూన్ 12 (విజయక్రాంతి) : నగరంలో మ రోసారి డ్రగ్స్ దందా బయటపడింది. బహదూర్‌పురాలోని హసన్ నగర్ క్రాస్ రోడ్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నార్కొటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను, 6 సెల్‌ఫోన్లను స్వా ధీనం చేసుకున్నారు.
నార్కొటిక్ బ్యూరో పోలీసులు తెలిపిన ప్రకా రం.. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌డీ ఫైసల్, అతని భార్య మస్రత్ ఉన్ని సా బేగం, ఎండీ అబ్రరుద్దీన్, రహ్మత్‌ఖాన్, కర్ణాటకకు చెందిన జునైద్ ఖాన్ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దం దా నిర్వహిస్తున్నారు. నిందితుడు ఫైజల్ కర్ణాటకలోని తమ ముఠా సభ్యుడు జునైద్‌ఖాన్ ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేసి తన భార్య మస్త త్ ఉన్నిసాభేగం ద్వారా హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నాడు.
రెండ్రో జుల క్రితం బహదూర్‌పురా వద్ద డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్టీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు పీ రమేష్ రెడ్డి, డీ సంతోష్‌కుమార్ ఆధ్వర్యం లో దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఫైసల్‌పై ఇప్పటికే అంబర్‌పేట, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్‌కు సంబంధించిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 19 మంది కస్టమర్ల వివరాలను పోలీసులు గుర్తిం చారు. అయితే యువత, విద్యార్థులు డ్రగ్స్ బారీన పడకుండా తల్లి దండ్రులు వారిపై నిఘా ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 8712671111 నంబర్, tsnabho----- ద్వారా అందించాలని కోరారు.






