ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం గడువు పెంపు
12-05-2026 01:30 AM
బైంసా, మే 11(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువులు ఈనెల 14 వరకు పొడిగించినట్లు వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ తెలిపారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశం కోసం పదో తరగతి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. బాసరలో 1650, మహబూబ్‌నగర్‌లో 188 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈనెల 10 వరకు గడువు ఉండగా 14 వరకు పొడిగించినట్లు, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






