calender_icon.png 4 July, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల ప్రియ నేస్తం

11-12-2024 12:00:00 AM

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1946లో తాత్కాలికంగా ఏర్పడిన ‘యూనిసెఫ్’ తదనంతర కాలం 1953లో శాశ్వత ఐరాస విభాగంగా రూపొందింది. నేడు (డిసెంబర్11) ‘యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్స వం’ జరుపుకుంటున్నాం. -ఈ ఏడాది ‘భవిష్యత్తు గళాలను విందాం’ ఇతివృత్తాన్ని నిర్వా హకులు ప్రకటించారు.

ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా యూనిసెఫ్ సేవలు అందిస్తున్నది. బాలల సమగ్రా భివృద్ధికి కావలసిన అన్ని ప్రణాళికలనూ విధిగా అమలు చేసే దిశగా వేడుకలు అంతర్జాతీయంగా కొనసాగిస్తున్నారు. చిన్నారుల ఉజ్వల భవితకు గొడుగులు పడుతూ ముం దుకు సాగుతున్న యూనిసెఫ్‌ను ఈ సందర్భంగా అభినందించాల్సిందే.

అభాగ్య బాల లను మానవీయ దృక్పథంతో అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఈ అంతర్జాతీయ సంస్థ 190కి పైగా దేశాల్లో అవిరళ కృషి సాగిస్తున్నది. 1965లో నోబెల్ శాంతి బహు మతిని సహితం దక్కించుకున్న యూనిసెఫ్ పిల్లల ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించేందుకు అంకితమై పనిచేస్తున్నది.

‘నేటి బాలల రేపటి ఉజ్వల భవిత’కు నేడే పెట్టుబడి పెట్టాలనే ధ్యేయ సాధన కోసం అన్ని దేశాల ప్రభుత్వాలు విధిగా కృషి చేయాలి. పిల్లల చైతన్యవంతమైన భావనలకు పట్టం కట్టడం, వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఊతం ఇవ్వడం ప్రతీ ఒక్కరి బాధ్యత. 

 డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి