04-07-2025 03:10:52 PM
ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య
చిట్యాల,(విజయక్రాంతి): భారత విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతరామరాజు(Alluri Sitarama Raju) అని ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అన్నారు.శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏవైఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గుర్రపు రాజేందర్ ,దుడపాక సాంబయ్య, సరిగొమ్ముల రాజేందర్, కనకం తిరుపతి,కట్కూరి రాజు , నేరెల్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు.