04-07-2025 02:59:53 PM
హైదరాబాద్: పీఏసీ భేటీలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ ఛార్జ్ మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ కలుపుకుని పోవాలి.. కొత్త , పాత అనే తేడా వద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని మల్లికార్జున ఖర్గే సూచించారు. పార్టీ గురించి బహిరంగ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని పేర్కొన్నారు.
ఏమైనా విభేదాలుంటే మీనాక్షి నటరాజన్ దృష్టికి తేవాలని కోరారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అధ్యక్షతన పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు పాశ మైలారంలో(Pashamylaram Chemical Factory Blast) పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన వారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించారు. అంతకు ముందు లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు.