04-07-2025 03:09:30 PM
చిలుకూరు : తెలంగాణ ఉద్యమo తొలి అమరజీవి దొడ్డి కొమరయ్య(Doddi Komaraiah) 79 వ, వర్ధంతిని చిలుకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య మాట్లాడుతూ, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఒరిగిన తొలి అమరుడు కొమరయ్య అని, ఆయన చేసిన ఆత్మ బలిదానంతో తెలంగాణ పోరాటానికి శ్రీకారం చుట్టి నిజాం నవాబును తరిమికొట్టిన చైతన్యాన్ని మరోసారి నేటితరం పునికి పుచ్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిరాపురపు, శ్రీనివాసరావు, బీసీ సంఘం నాయకులు కొండ,రాములు, బెల్లంకొండ, భుజంగరావు, తాడేపల్లి, తిరుమలరావు, బెల్లంకొండ, మహేష్, మాచర్ల, నవీన్, కస్తూరి, నవీన్, బాల బోయిన, శ్రీనివాసరావు, అంజయ్య, బోటు, వెంకటి, పాల్గొనడం జరిగింది.