మాజీ డిప్యూటీ స్పీకర్ వర్ధంతి వేడుకలు
19-09-2025 07:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ స్వర్గీయ అయిల భీమ్ రెడ్డి వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన మునుపెల్లి తోపాటు లక్ష్మణ చాందా నిర్మల్ మండలాలలో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు భీమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోలేరని పేర్కొన్నారు.




