19-09-2025 07:12:52 PM
మందమర్రి,(విజయక్రాంతి): విద్యార్థులు దసరా సెలవులలో చదువుపై దృష్టిసారించి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని పట్టణ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ కోరారు. శుక్రవారం పాఠశాల లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించి న సమావేశంలో ఆమే మాట్లాడారు. విద్యార్థులకు దసరా సెలవులు అనంతరం పరీక్షలు నిర్వహించనున్నందున సెలవులను వృథా చేయకుండా తమ పిల్లలు చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు కృషి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయాలని కోరారు.
అనంతరం మెగా ప్లాంటేషన్ లో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఒక్కో మొక్కను నాటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం గత నెలలో నిర్వహించిన స్కూల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన వారికి వివిధ బాధ్యతలను అప్పగించారు. వీరిలో స్కూల్ కెప్టెన్, హెడ్ గర్ల్, హెడ్ బాయ్, స్పోర్ట్స్ కెప్టెన్, బాధ్యతలు అప్పగించి బాధ్యత నిర్వహణపై బాధ్యులకు అవగాహన కల్పించారు.