06-12-2025 09:50:27 PM
* వైద్యం కోసం రూ.30 లక్షల భారం
* ప్రమాదంలో గాయపడిన యువకుడికి అత్యవసర సాయం
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం కన్యారం గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ ఇటీవల తన వ్యవసాయ పొలంలో నాట్ల కోసం ట్రాక్టర్తో దున్నుతుండుగా ట్రాక్టర్ (కేజీవాల్) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతానికి అతడిని హైదరాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
వైద్యుల ప్రకారం అక్బర్ ఆపరేషన్ కోసం సుమారు రూ.30 లక్షల ఖర్చు అవుతుందని వెల్లడించారు. పేద కుటుంబానికి చెందిన అక్బర్ ఈ పెద్ద మొత్తాన్ని తన కుటుంబం స్వయంగా సమకూర్చడం అసాధ్యం. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆపన్నుల కోసం ఎదురుచూస్తోంది. మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు తమ కుమారున్ని బతికించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం అక్బర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం చేసే దాతలు 8143966605 నంబరుకు సంప్రదించాలని కుటుంబీకులు కోరుతున్నారు.