16 April, 2026 | 2:42 AM

తుంగతుర్తిలో ఘనంగా మహాకవి దాశరథి వర్ధంతి

05-11-2025 05:43 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన మహా విప్లవ కవి దాశరధి కృష్ణమాచార్యులేనని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. తన కలంతో గళం తోస్వరాష్ట్రసాధన అకాంక్షను, ప్రజల్లో రేకెత్తించి, పోరాటానికి సిద్ధం చేసిన మహనీయుడు దాశరధి అని కొనియాడారు. వర్ధంతి సందర్బంగా బండారామారంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి మహేందర్, కోరుకొప్పుల వెంకన్న, పొదిల అంజయ్య, జటంగి బక్కయ్య, చల్ల సోమన్న, కొల్లూరి లింగయ్య పాల్గొన్నారు.