05-11-2025 05:41:31 PM
మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్..
అమీన్ పూర్: కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపైన బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ... కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునే లక్ష పైచిలుకు భక్తులకు మా సభ్యులతో కలిసి ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు నరసింహా గౌడ్ తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన తెలిపారు.