calender_icon.png 3 December, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వెస్టర్ ఢీకొని మృతి..

03-12-2025 06:29:46 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని దౌడేపల్లి శివారులోని ముత్తే బుచ్చయ్య పల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం హార్వెస్టర్ ఢీకొని బలరావుపేట గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మెంగని మధుకర్ అనే వ్యక్తికి గాయాలైనట్లు ఎస్సై గొప్ప సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మల్లేష్ మధుకర్ ను బైక్ పై ఎక్కించుకొని కోర్విచల్మా గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి బాకీ ఉన్న డబ్బులను అప్పగించి వస్తుండగా ముత్తే బుచ్చయ్య పల్లె వద్ద హార్వెస్టర్ వాహన డ్రైవర్ తన వాహనాన్ని సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న ఇరువురు బైక్ను ఆపగా హార్వెస్టర్ డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా రివర్స్ తీయగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుని కొడుకు దుర్గం సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.