calender_icon.png 3 December, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ప్రత్యేక చట్టాలు

03-12-2025 06:25:54 PM

న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..

ఇల్లెందు (విజయక్రాంతి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందు కోర్టు ఆవరణలో ఇల్లందు మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూసే ధోరణిని ఉందని ఆ ధోరణిని మార్చుకోవాలని వారికి కూడా ప్రత్యేక చట్టాలు ఉంటాయని, చదువు, ఉద్యోగాల భర్తీ, పనిచేసే విషయంలో వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని, దివ్యాంగులు సొంత తెలివితేటలతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సేతు యాప్ అనే ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసిందన్నారు.

ఈ యాప్ ద్వారా చదువుకున్న దివ్యాంగులు వారి సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ యాప్ గురించి అవగాహన లేని దివ్యాంగులు దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి చేతుల మీదుగా ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులను శాలువాతో సత్కరించి, వారికి పండ్లు ఫలాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్, జూనియర్, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.