calender_icon.png 3 December, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లలు విడుదల చేసిన కలెక్టర్

03-12-2025 06:33:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): మత్స్యకారులు మత్స్య సంపద పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ గ్రామీణ మండలం డ్యాంగాపూర్ గ్రామంలోని చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారులు మత్స్య సంపద వల్ల ఆర్థికంగా బలపడవచ్చని అన్నారు. విడుదల చేసిన చేప పిల్లలు, సరైన సైజుకు రాగానే, చేపలను పట్టి విక్రయించి లాభాలు పొందాలని ఆశించారు. ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఏడి ఫిషరీస్ రాజ నర్సయ్య, తాసిల్దార్ ప్రభాకర్, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.