17 April, 2026 | 5:21 AM

అదృశ్యమైన వ్యక్తి మృతి

27-05-2025 10:10 PM

కొండపాక: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలిన సంఘటన కొండపాక మండలం(Kondapaka Mandal) తిమ్మారెడ్డిపల్లి శివారులో చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సున్నం భాస్కర్(32) అనే వ్యక్తి ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని కోసం కుటుంబీకులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. తిమ్మారెడ్డిపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద చెప్పులు కనబడడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దాంతో గ్రామస్తులు సహకారంతో పోలీసులు సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు గాలించారు. చివరకు రాత్రికి శవం లభ్యమయింది. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ గా గుర్తించారు. అప్పుల తీర్చలేక కలత చెంది మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కుటుంబీకులు పేర్కొన్నారు. ఆయనకు భార్య ఒక బిడ్డ ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.