27-05-2025 10:16:57 PM
కోదాడ: సూర్యాపేట జిల్లాలోనే 100 అడుగుల జాతీయ జెండా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(Indian Veteran Organization) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు, ఐవీఓ తెలంగాణ రిప్రజెంటేటివ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 100 అడుగుల జాతీయ జెండా వద్ద సుందరీకరణ పనులు పూర్తి కావడంతో, నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
సుమారు నాలుగు లక్షల ఖర్చుతో జెండా ఆవరణంలో సుందరీకరణ పనులు చేయించామని, ఈ కార్యక్రమం కోసం ఆర్థిక సాయం చేసిన దాతలకు ధన్యవాదాలు ఆయన అన్నారు. దేశభక్తి పెంపొందించేలా జాతీయ రంగులతో సుందరీకరణ పనులు చేశామన్నారు. పుర మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ ట్రెజరీ రమేష్ బాబు, డిస్ట్రిక్ ట్రెజరర్ వెంకన్న, జనరల్ సెక్రెటరీ ఉపేందర్, సత్తిబాబు, వెంకన్న, గోపి, రహీమ్ పాల్గొన్నారు.