27-05-2025 10:07:55 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఎస్సీ విద్యార్థుల ఫీజు చెల్లింపు సంబంధించి జి.ఓ నం.6ను రద్దు చేయాలని మాదిగ స్టూడెంట్ యూనియన్(Madiga Student Union) ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ(Bellampalli RDO Harikrishna) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్యూ నాయకులు మాట్లాడారు. ఏప్రిల్ 22న తెలంగాణ ప్రభుత్వం జి.ఓ నం.6ను విడుదల చేసిందన్నారు. ఈ జీవోలో ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ మంజూరు కావడానికి ముందే ట్యూషన్ ఫీజును పూర్తిగా చెల్లించాల్సిందిగా ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల క్యాంపస్ లోని చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
పేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళు ఈ జి.ఓ.కు ముందు, ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నేరుగా స్కాలర్షిప్ రూపంలో చెల్లించేదనీ పేర్కొన్నారు. ఇప్పుడు ముందుగా వేల రూపాయల్లో ఫీజు చెల్లించాలి, తదుపరి స్కాలర్షిప్ మంజూరు అవుతుందనీ తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ ల్లో దాదాపు వందల మంది ఎస్సీ విద్యార్ధులు అందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిన వారనీ తెలిపారు. చాలామంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఉన్నారనీ, వారిపై వేల రూపాయల్లో భారం పడుతుందన్నారు. ఈ విషయమై మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే స్పందించి ఈ జిఓ నెం.6ను రద్దు చేయాలని మాదిగ స్టూడెంట్ యూనియన్ నాయకులు కోరారు. మునుపటి విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి వేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు, మాదిగ స్టూడెంట్ యూనియన్ నాయకులు దుర్గయ్య, కోళ్ల రమేష్, ఆకులూరి రాజ్ కుమార్, గోగర్ల శేఖర్, కలువల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.