calender_icon.png 10 November, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టకాలంలో పేద కుటుంబాన్ని ఆదుకున్న డాక్టర్ సంపత్ కుమార్

10-11-2025 01:06:14 PM

తాండూరు,(విజయశాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్  వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఓ నిరుపేద కుటుంబానికి ఆపదలో ఆర్థిక సహాయ అందించి ఆదుకున్నారు. తాండూరు పట్టణం 33వ వార్డ్  పవరే శ్రీనివాస్ రావు ఈరోజు హఠాత్తుగా మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ ఆ నిరుపేద కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందించారు. ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ సంపత్ కుమార్ కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .