91 లక్షల ధాన్యం స్కాం
కోట్ల రూపాయల కుంభకోణం అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ మజీద్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో ఆరుగాలం శ్రమించి పండించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లి రైతులు అమ్మిన వరి ధాన్యంలో భారీ స్కాం 5 నుండి 6 కోట్ల కుంభకోణం జరిగిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారని,ఈ కుంభకోణంలో పెద్దపెద్ద రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు ఉన్నారని వారందరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జిల్లా ఇంచార్జ్ మజీద్ ఉన్నతాధికారులను కోరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ మజీద్ మాట్లాడుతూ ధాన్యం అక్రమ రవాణా చేసిన వారిని పోలీస్ శాఖ గుర్తించి 6గురిని అరెస్టు చేసి 14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకుని,
46.21 లక్షలు బ్యాంకులలో ఉండగా వాటిని సీజ్ చేయడం పోలీస్ శాఖ పనితీరును అభినందించాల్సిందే అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకెళ్లగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యాన్ని తూకం వేసి రైతుల వివరాలు ధృవీకరించడం జరుగుతుందన్నారు. ట్రాక్ షీట్ జారీ చేసి ధాన్యాన్ని గోదాంలకు రవాణా చేయగా, గోదాంలో ధాన్యాన్ని దిగింపు చేసిన అనంతరం నమోదు చేయడం జరుగుతుందని అట్టి దాన్యం ఆన్లైన్ అప్డేట్ అవుతుందన్నారు. అనంతరం రైతులకు డబ్బులు బ్యాంకుల ద్వారా చెల్లింపు జరుగుతుందని, ఏ ఒక్క ప్రక్రియ కాకున్న రైతులకు చెల్లింపులు జరగవు అన్నారు.
అలాంటి పకడ్బందీ ప్రక్రియ ఉండగా ఇంత పెద్ద భారి ధాన్యం కుంభకోణం జరగడం దారుణమని ఈ కుంభకోణంతో రైతులు నష్టపోవడం జరుగుతుందన్నారు. టిఆర్ఎస్ అధినేత కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పాంచ జన్యo పథకాలతో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి- ఉద్యోగాలు, రైతే రాజు, సామాజిక న్యాయం దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కవితక్క కంకణం కట్టుకోవడం జరిగిందన్నారు. కవితక్క ముఖ్యమంత్రి కాగానే రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం అన్ని కార్యాలయాలలో ప్రత్యేక గది ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి సమస్యలు వెంటనే పరిష్కరించి రైతులకు అండగా ఉంటానని కవితక్క హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు ఇంకా చాలామంది ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది అని కుంభకోణంలో ఎవ్వరు ఉన్న వారిని గుర్తించి ఉన్నతాధికారులు శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ మజీద్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కదిరే భాస్కర్, సయ్యద్ జావిద్, ఓర్సు అశోక్, బైరి రాజేష్, సయ్యద్ మౌలా, వేములవాడ నాయకులు తోట కనకయ్య, అంతర్పుల బాబు, వీర్నపల్లి మండల నాయకులు బండి శ్రీహరి, మండేపల్లి రవి పాల్గొన్నారు.






