దళితవాడలను అభివృద్ధి చేయాలి
22-06-2026 05:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దళిత వాడల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు విలాస్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని దళితవాడలను సందర్శించారు. సమాజంలో అంటరానితనం అనే అవమాననియా దూరచారానికి బలిపోతున్న దళితుల సంక్షేమంపై కృషి జరగాలన్నారు.
దళితులను సామజిక ఆర్ధిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి, అణచివేతాలను ఎదిరిచి సమానత్వాన్ని సాధించేందుకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ విలాస్,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దుర్గే అనంత రావు, కామ్రేడ్ భూక్యా రమేష్ గిరిజన సమాఖ్య కన్వీనర్,, కోట్ల నారాయణ, తదితరులు ఉన్నారు






