01-07-2025 02:27:52 PM
హైదరాబాద్: నేటి సమాజంంలో మనిషిని మనిషే నమ్మలేకుండా పోయింది. పేద, మధ్యతరగతి వారు కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని, భవిష్యత్ లో ఉపయోగపడుతుందని చిట్టీలు వేసుకుంటారు. కానీ వారి ఆశలను కొందరు కేటుగాళ్లు ఆసరాగా తీసుకొని చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఓ ముఠా చిట్టీల పేరుతో రూ.కోటిన్నర మోసం చేసింది. మోసపోయామని గ్రహించిన 42 మంది బాధితులు మంగళవారం నాడు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చిట్టీ పుస్తకాలు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.